Natyam ad

శ్రీకాంత్ రెడ్డికి ఢీకొనే శక్తి ఏ రాజకీయ నాయకులకు లేదు

రాయచోటి ముచ్చట్లు:

 

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, రాయచోటి నియోజకవర్గం లో శ్రీకాంత్ రెడ్డికి ఢీకొనే శక్తి ఏ రాజకీయ నాయకులకు లేదని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ ఒక పర్కటనలో తెలిపారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అందించని జనరంజక పాలన అందించారని, రాయచోటి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభివృద్ధి అందించని అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని మరోసారి శ్రీకాంత్ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలని ఏ ఊరు చూసినా ఏ వాడ చూసిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు, పవన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జీవితకాలం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మన్సూర్ అలీ ఖాన్ విమర్శించారు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి, టిడిపి, జనసేన పార్టీలకు బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

 

Post Midle

Tags: No politician has the strength to match Srikanth Reddy

Post Midle