ప్రజారోగ్యానికి ఇబ్బందులురారాదు – మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండ తగు చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.ఆదివారం డిఎంఅండ్‌హెచ్‌వో శ్రీహరి, పుంగనూరు కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో కరోనా నియంత్రణ వివరాలను, రోగులకు అందుతున్న వైద్యసేవలు గురించి విచారించారు. అలాగే థర్డ్ వేవ్‌ చిన్నపిల్లలకు వస్తోందని అంటున్న నేపధ్యంలో వైద్యులు చిన్నపిల్లల పట్ల మరింత శ్రద్ద తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలకు ఎలాంటి కరోనా లక్షణాలు ఉంటే వారిని తక్షణమే మెరుగైన వైద్యసేవలకు పంపించే ఏర్పాట్లు చేయాలని , వారి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: No problem for public health – Minister Dr. Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *