వ్యాక్సిన్ పై అపోహలు వద్దు-మంత్రి సత్యవతి రాథోడ్

Date:15/01/2021

మహాబూబాబాద్ ముచ్చట్లు:

ఈ నెల 16వ తేదీ నుంచి కొవిడ్ కు వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా  జెడ్పీ కార్యాలయంలో నేడు వాక్సిన్ పంపిణీ ఏర్పాట్ల పై నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. వ్యాక్సిన్ ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలు సమీక్షించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  ఈ వ్యాక్సిన్ రాకతో గత పది నెలలుగా ఎదుర్కొన్న కష్టాలు తీరనున్నాయని అన్నారు.
వ్యాక్సిన్ పై అనేక అపోహలు కొంతమంది సృష్టిస్తున్నారు. అందులో వాస్తవం లేదు. అనేక పరీక్షల తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చారు. కోవిడ్ సందర్భంగా ముందువరుసలో ఉండి పని చేసిన వారికి మొదటగా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆతర్వాత దశలవారీగా మిగిలిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.  కాబట్టి అధికారులకు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి ఈ ఈ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నానని ఆమె అన్నారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags:No rumors on vaccine: Minister Satyavathi Rathore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *