నో స్కూల్స్… పేరంట్స్ మనోగతం

హైదరాబాద్ ముచ్చట్లు:

 

భావి భారత పౌరుల చదువులు వ్యాక్సినేషన్‌పై ఆధారపడ్డాయి. కరోనా భయాలు తొలగక పోకపోవడంతో పిల్లలను స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు తటపటాయిస్తున్నారు.  మరోవైపు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పిల్లలకు ఎప్పుడు టీకా ఇవ్వాలనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలను స్కూళ్లకు పంపడం, టీకాలు ఇవ్వడంపై భారతీయుల ఆలోచణ ధోరణిని తెలుసుకునే  ప్రయత్నం లోకల్‌సర్వే సంస్థ చేసింది. అందులో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. జులై 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థలు తెరుచుకోవడంపై ఇతర రాష్ట్రాలు ముందు వెనుకా ఆలోచిస్తున్న సమయంలోనే తెలంగాణ సర్కారు నిర్ణయం ప్రకటించింది. అయితే పిల్లలను బడులకు పంపడం, టీకాలు ఇవ్వడంపై తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునేందుకు లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ 1,789 మంది తల్లిదండ్రు అభిప్రాయాలు సేకరించి విశ్లేషించింది.

 

 

 

విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభమైన పిల్లలను చదువుకునేందుకు పంపిస్తామని 26 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.  జిల్లాలలో పూర్తిగా కోవిడ్‌ కేసులు తగ్గిపోయినప్పుడే తమ బిడ్డలను విద్యాసంస్థలకు పంపిస్తామని 15 శాతం మంది పేరెంట్స్‌ తెలిపారు. తాము నివాసం ఉండే జిల్లాతో పాటు పొరుగు జిల్లాలలో కూడా జీరో కరోనా కేసులు నమోదయితేనే తమ వాళ్లను స్కూళ్లు/ కాలేజీలకు పంపిస్తామని 24 శాతం మంది కుటుంబ పెద్దలు వెల్లడించారు. తమ పిల్లలకు టీకాలు అందించేంత వరకు బడులు/ కాలేజీలకు పంపబోమంటూ 33 శాతం మంది తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. కేవలం  2 శాతం మంది మాత్రమే ఎటూ తేల్చుకోలేకపోతున్నామన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: No schools … Parents allure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *