రోహిత్ శర్మకు నో చెప్పిన సెలక్టర్లు

No selectors from Rohit Sharma

No selectors from Rohit Sharma

Date:18/07/2018
ముంబై ముచ్చట్లు:
ఇంగ్లాండ్‌ గడ్డపై ఇటీవల రెండు మెరుపు శతకాలు బాదిన ఓపెనర్ రోహిత్ శర్మకి మరోసారి భారత సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి ఐదు టెస్టుల సిరీస్‌‌ జరగనుండగా.. తొలి మూడు టెస్టుల కోసం బుధవారం భారత జట్టుని సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. అందులో రోహిత్ శర్మకి చోటివ్వలేదు. అఫ్గానిస్థాన్‌తో గత నెల బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌‌కి రోహిత్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో.. ఇంగ్లాండ్‌ పర్యటనని మెరుగ్గా ఆరంభించిన రోహిత్ శర్మ మూడో టీ20లో కేవలం 56 బంతుల్లోనే 11×4, 5×6 సాయంతో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం జరిగిన తొలి వన్డేలోనూ 114 బంతుల్లో 15×4, 4×6 సాయంతో 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ.. టెస్టు ఎంపికలో ఈ ప్రదర్శనని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చే రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తుంటాడు. తాజాగా సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టుని ఓ సారి పరిశీలిస్తే.. మిడిలార్డర్‌లో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్‌‌కి అవకాశం దక్కింది. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికవగా.. మూడో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌కి ఛాన్స్ లభించింది. ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టులకి భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్
రోహిత్ శర్మకు నో చెప్పిన సెలక్టర్లు https://www.telugumuchatlu.com/no-selectors-from-rohit-sharma/
Tags:No selectors from Rohit Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *