Natyam ad

ఎంఎల్ఏ అభ్యర్థిగా షేక్ అన్వర్ భాష నామినేషన్

పుంగనూరు ముచ్చట్లు:


సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మన చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంఎల్ఏ అభ్యర్థిగా షేక్ అన్వర్ భాషఅను నేను మీ అందరి సహకారంతో, మీ అండదండలతో, అన్ని సమాజిక వర్గాల ఆశీస్సులతో నామినేషన్ వేసాను,, మీరంతా నాకు ఓటు వేసి అత్యధిక మెజా ర్టీతో గెలిపిస్తారని మనస్పూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను,,, నన్ను గెలిపించుకోవడం పుంగనూరుకు ఒక చా రిత్రక అవసరం, ప్రతిఒక్కరి భాధ్యత,, నాకు మీరువేసే ప్రతి ఓటు పుంగనూరు అభివృద్ది పథంలో కి నడిపిస్తానని, సవినయంగా తెలియ జేసుకుంటున్నను,,

 

అసలు అభివృద్ది అంటే ఏమిటి?,,?
జగన్ మోహన్ రెడ్డి  పెన్షన్ పెంచుకుంటూ 3వే లవరకు చేశారు,, దానిని చంద్రబాబు గారు 4వేలు చేస్తాను అంటున్నాడు,, మరి నేనేం చెయ్యాలి,, 5వేలు ఇస్తాను అని చెప్పమంటారా? చెప్పండి?, పథకాలడబ్బులు పెంచితే అది అభివృద్ధినా,,,,,?
జగన్ బటన్లు నొక్కి నొక్కి రాష్ట్రాన్ని గుల్ల చేస్తే బాబు వచ్చి 4వేలకు ఈ రాష్ట్రాన్ని ఇంకెంత గుల్ల చేయాలో!,,,
బీజేపీ ప్రభుత్వం, సిలెండర్ ను 400కే ఇస్తాను అంటుంది,, మరి ఈ పదేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదు,, అసలు సిలెండర్ రేటెంతా,,, అంటే ఇన్నేళ్లుగా ప్రజలను మోసం చేయలేదా,,,,
కాంగ్రెస్ ప్రభుత్వ ఉచిత ప్రయాణం అంటుంది,, కరెంటు ఉచితం అంటుంది,, ఇది సమoజసమా,,,,
మనం టికెట్ కొని ప్రయాణం చేస్తే ఆర్టీసీ సంస్థ నడుస్తుంది,, విద్యుత్తు సంస్థ నడుస్తుంది,,
మరీ ఉచితం అంటే ఆ సంస్థలు ఏమ్ కావాలి,, నష్టాల్లో వుందని ప్రైవేటి కరణ చేయాలన,,,,

 

Post Midle

మేము చార్జీలు, ధరలు తగ్గిస్తాం అని అనకుండా ఉచితం అంటే ఎవడబ్బ సొమ్ములని ఉచితంగా ఇస్తావు,, ఈ నాయకులకు అసలు బుర్ర వుందా?
ఇటువంటి పథకాలు రాష్ట్రానికి క్షేమమ,,, రాజకియ పథకాలు ప్రజలను బిచ్చగాళ్ళుగతయారు చేస్తున్నారే తప్ప ప్రజల కొనుగోలు శక్తిని,, ఆదాయాన్ని పెంచడం లేదు
అందుకే నేను పుంగనూరు ప్రజలతో మనసు విప్పి మాట్లాడుతున్న,,, నేను పుంగనూరు బిడ్డను,, ఇక్కడి కరువు చూశాను,, ఇక్కడి రాజకియ కక్షలు చూశాను,,
ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఏమీ కోరుకుంటున్నారో స్వయంగా విన్నాను, వారి కన్నీళ్లు చూశాను,, అందుకే ప్రధానమైన, 5సమస్యలపై దృష్టి పెట్టాను,,
విద్య,, ఎడ్యుకేషన్,,,
మన పిల్లలు పై చదువులు చదవాలంటే తగిన కాలేజీలు,, ఐ టీ ఐ లు, కోచింగ్ సెంటర్లు లేవు,, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు స్కూల్స్, ఉన్నత పాఠశాలల పెంపు లేదు ఉర్దూ పాఠశాలలు లేవు,, అందుకే మన పిల్లలు మన ఊరిలోనే పైచదువులు చదివి మనపుంగనూరులోనే ఉద్యోగాలు సాధించుకునేలా విద్యావ్యవస్థను తీర్చి దిద్దలన్నదే నా కల,, ఎందుకంటే నేనునా స్నేహితులు ఇక్కడే చాడుకున్నము,, ఎంత కష్టపడ్డామొ మాకుతెలుసు,,,

 

ఉపాధి,, అన్ ఎంప్లయిమెంట్
ఎంతో కష్ట పడి ఊర్లు దాటి చదువుకుని వస్తే ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు లేక ఊరిస్తున్న ప్రభుత్వా పథకాలు లేక, ఇటు పిల్లను ఎవరూ ఇవ్వక, అతి కష్టంతో సంసారాన్ని ఈదుతూ గుమస్తాలుగా,, పెయిటర్లుగా, కూలీలుగా,, జీవితం గడుపుతున్నారు,, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాల భర్తీ లేదు,, ప్రయివేట్ ప్రశ్రమలు లేవు,,, కొందరు వ్యసనాలకు బానిసలుఅవుతుంటే,, మరికొందరు వలసలు వెళ్ళి ప్రణాలమీదకు తెచ్చుకుంటున్నారు,, అందుకే నేను మాట ఇస్తున్నాను,, సాధ్యమైనంతవరకు యువకులకు పారిశ్రామిక శిక్షణా ఇప్పిస్తా,, పారిశ్రామిక వేత్తలు గా తీర్చి దిద్దుత,,, చిన్న భారీ పరి శ్రమల ఏర్పాటు, సబ్సిడీ లోన్లు , బ్యాంక్ లోన్లు,, అలాగే విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు మన పుంగనూరు కు తీసుకు రావాలన్నదే నా ప్రధాన ఆశయం,,

 

వైద్యం,, ఆరోగ్యం,,,
సోదరులారా మరో ముఖ్యమైన శాఖ వైద్యం,, నేటి నాయకులు 77సంవత్సరాలుగా అభివృద్ది,, అభివృద్ది అని అవులిస్తున్నారు,, ఒక గర్భిణీ మహిళకాన్పు కోసం డోలి లో మోసుకు పోతున్న గ్రామాలు మన కళ్ళముందే ఎన్నో వున్నాయి,, కాన్పు కోసం పక్కవురికి వెళ్లి క్రమంలో రోడ్లుసరిగా లేక సమయనికి వైద్యం అందక ఎన్నో శిశు మరణాలు బాలింత మరణాలు జరిగాయి ఎంతోమందికి కడుపుకోత మిగిల్చింది,, ఇలాంటి సంఘటనలు, మన పుంగనూరు అసెంబ్లీలో ఎన్నోజరిగాయి,, ఐన ఏ నాయకులు స్పందించలేదు,, మన పుంగనూరు లో కాన్పుల ఆసుపత్రి, అత్యవసర విభాగం,, ఒక సార్వజనీన ఆసుపత్రి సాధించాలని, అందుకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను,,

 

 

సాగునీరు,,, తాగు నీరు,,,,
మనదేశం వ్యవసాయిక ఆధారిత దేశం,, వ్యవసాయం వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందనడంలో సందేహం లేదు,, కానీ నేటినాయకుల కక్షల, వర్గాల వల్ల చెరువులు ఎండిపోయాయి,, నేల బీడు పోయింది,, వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి,, భూములన్నీ రియల్ ఎస్టేట్ లు మారిపోతున్నాయి,,, పశువులకు ఎండు గడ్డి ధరలు కూడా పెరిగిపోయినాయి,,
పలేటుర్లలో పాడిపరిశ్రమ కుదేలైంది,, పాలకేంద్రాలు, ప్రయివేట్ కరణ జరిగింది,, నీటి వసతి కరువైంది,,, ఏ ఒక్క నాయకుడు కూడా రైతుకు సకాలంలో పంటకు నీరు అందించలేక పోయాడు,,

 

మన పంటలపై విదేశీ పెట్టుబడిదారులు పేటెంట్ హక్కుల కోసం పోరాడుతున్నారు,, రైతు నల్ల చట్టలువచ్చాయి,, రాబోయ కరువు, క్షామం గురించి మేధావులు ఆందోళన చెందుతుంటే మన నాయకులు రైతులకు మద్దతుగా కూడా నిలబడటం లేదు,, మన పుంగనూరుకోసమెప్పుడో రాజశేఖరరెడ్డిహయాంలో హంద్రీ, నివా కాలువలుతీస్తే కొడుకు జగన్ హయంలో కాలువలు పుడుకు పోయినాయి,, చివరికి అన్నంపేట్టే రైతులను కూడా మోసం చేస్తున్న నాయకులనునమ్మి ఓటు ఎలా వేస్తారు,, నేను గ్రామాలలో, పల్లెటూర్లలోపర్యటించి నపుడు గమనించిన ప్రధాన సమస్య చేతి వృత్తులకు తగిన అదరణ, గిరాకి లేకపోవడం,, వ్యవసాయ కూలీలు గిట్టుబాటు లేకపోవడం గమనించాను,, అందుకే ఆయా గ్రామాల్లో మహిళలే నిర్వహించుకునేల పాలాడైరీ, బయో గ్యాస్, కుటీర పరిశ్రమలు స్థాపించుకునేల
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను,,

 

 

వ్యాపారం,,
చివరిగా వ్యాపారస్తుల ఎగుమతి, దిగుమతి సుంకాలు,, వారి లైసెన్స్ లు, గుమస్తాల సంక్షేమం,,
అలాగె గ్రామాలలో శుద్ధి చేసినతాగునీరు, రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, పార్కులు, డంపింగ్ యార్డు ప్రతి సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి అతి తక్కువ సమయంలోనే పరిష్కరించడానికి కృషిచేస్తానని,, నాకున్న సమయంలొ ఎక్కువగా పుంగనూరు నీయోజక వర్గంలోనే ప్రజలకు ఆమ్ దుబాటులోవుంటానని, రాగద్వేషాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగకుండా అన్ని సమాజిక వర్గాలను కలుపుకుని మన పుంగనూరును అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తనని, నేను నమ్ముకున్న దైవం సాక్షిగా మీరంతా నాకు ఓటు వేసి భారి మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ

Tags:Nomination of Sheikh Anwar Bhasha as MLA candidate

Post Midle