నామినేషన్ల కార్యక్రమానికి విలేకరులకు నోఎంట్రి

Nominee for reporters to the nomination program

– ఆర్‌వో చర్యలను నిరశిస్తూ విలేకరుల ధర్నా

Date:21/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో నామినేషన్ల కార్యక్రమ వివరాలను సేకరించేందుకు వెళ్లిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులకు అనుమతి లేకుండ ఆర్‌వో కనక నరసారెడ్డి నిషేదాజ్ఞాలు జారీ చేసిన సంఘటన గురువారం జరిగింది. జనసేన అభ్యర్థి నామినేషన్ల కార్యక్రమానికి వెళ్లిన విలేకరులను ఆర్‌వో అనుమతి లే దంటు పోలీసులు రోడ్డులో ఆపివేశారు. దీనిపై విలేకరులు ఆర్‌వోకు వ్యతిరేక నినాదాలు చేస్తూ , ఆర్‌వో కార్యాలయం ఎదుట ధర్నా చేసి, నిరసన తెలిపారు. ఆర్‌వో ఏకపక్ష నిర్ణయాలపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలలో మీడియాపై నిషేధం లేకున్నా ఆర్‌వో రానివ్వకపోవడంపై విలేకరులు మండిపడ్డారు. ఆర్‌వో కార్యాలయంలో అనుమతి లేకుండ వీడియా గ్రాఫర్లు, రాజకీయ నాయకులు ఉండటంపై విలేకరులు మండిపడ్డారు. ఈ విషయాలపై ఆర్‌వో ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలధీశారు. జనసేన సభ్యులను అధిక సంఖ్యలో అనుమతించారని ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐలు నాగశేఖర్‌, లక్ష్మన్నలు మీడియాతో, ఆర్‌వోతో చర్చించినా ఫలితం లేకపోయింది. ఆర్‌వో తన ఇష్టం అంటు ప్రవర్తించడంపై పోలీసులు , మీడియా అసహనం వ్యక్తం చేసింది.

జనసేన అభ్యర్థి రామచంద్ర నామినేషన్‌ దాఖలు

Tags; Nominee for reporters to the nomination program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *