వినయ్‌  భాస్కర్ కు నాన్ బెయిలబుల్  వారెంట్

Date:27/01/2021

వరంగల్ ముచ్చట్లు:

వరంగల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌కి ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకి హాజరుకాకపోవడాన్ని ప్రత్యేక న్యాయస్థానం సీరియస్‌గా పరిగిణించింది. ఆయనతోపాటు మరో 8 మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కి వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.2012 కాజీపేట రైల్వే స్టేషన్‌పై దాడి చేసిన కేసులో దాస్యం వినయ్ భాస్కర్‌ తో పాటు మరో 8 మందిపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న 9 మంది కోర్టుకు హాజరుకాకపోవడాన్ని న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించింది. ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకాని తొమ్మిది మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో రైలు రోకో కార్యాక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఖాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగిన దాస్యం వినయ్ భాస్కర్ సహా మరో 8 మందిపై అప్పట్లో కేసు నమోదైంది. ఆ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మిగిలిన 8 మంది కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన చేపట్టిన టీఆర్‌ఎస్ నేతలపై ఆయా ప్రాంతాల్లో కేసులు నడుస్తున్నాయి.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: Non bailable warrant for Vinay Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *