పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి

Date:04/01/2020

తిరువనంతపురం ముచ్చట్లు:

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాదు, తమ రాష్ట్రంలో దీనిని అమలుచేయబోమని స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వం సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం విశేషం. దేశవ్యాప్తంగా సీఏఏపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కలిసి పనిచేద్దామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. కలిసి రావాలని కోరుతూ ఈ మేరకు శుక్రవారం ఆయన జగన్ సహా పలువురు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలనే ఆలోచనలున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని విజయన్ కోరారు. కేరళ ప్రభుత్వం ఇదే తీర్మానాన్ని చేసిందని ఆయన తెలిపారు. దీనిద్వారా సీఏఏను ప్రతిపాదించిన వారికి కనువిప్పు కలుగుతుందని ఆకాంక్షించారు.ఎన్డీఏ మిత్రపక్షం సీఎం నితీష్ కుమార్ సహా మొత్తం 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన విజయన్.. సీఏఏ వల్ల దేశ లౌకికవాదం దెబ్బతింటుందని అన్నారు. సీఏఏ వల్ల దేశంలోని పెద్ద ఎత్తున ఆందోళనలు, ఆనుమానాలు తలెత్తాయని, దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం విలువలను కోరుకునే భారతీయులందరిలో ఐక్యత అవసరమని అన్నారు. జాతీయ జనాభా పట్టిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయని అన్నారు.ఏపీ సీఎం జగన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హోమంత్ సోరేన్, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఒడిశా సీఎం బిజూ పట్నాయక్ తదితరులకు విజయన్ లేఖ రాశారు.

 

ఆకతాయికి చుక్కలు చూపించిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయి

 

Tags:Non-BJP states strongly oppose the Citizenship Amendment Act

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *