Natyam ad

బాసరలో ఆగని ఆందోళనలు

అదిలాబాద్ ముచ్చట్లు:

బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ చుట్టూ పరిసరాలు పోలీస్ పహారా మధ్య ఉన్నాయి. అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా చెక్ పోస్టులు పెట్టారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వరకు రహదారి పై పలుచోట్ల చెక్ పోస్ట్ పెట్టగా అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీకి చేరుకునే ప్రయత్నం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు వెళ్తున్న తరుణంలో నర్సాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామారావు పటేల్ అరెస్టు చేశారు. దీంతో జిల్లాలో ఉన్న ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు నర్సాపూర్ చేరుకొని.. రోడ్డుపై బైఠాయించి తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల యొక్క సమస్య పరిష్కారం చేయాలని.. మా నాయకులు వెంటనే విడుదల చేయాలని, రోడ్డుపై బైఠాయించారు.పంటచేలలో నుండి ట్రిపుల్ ఐటీ వద్దకు వస్తున్న సుమారు 60 మందితో పాటు కృష్ణా నదీ జలాల కన్వీనర్ రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి తో పాటు బీజేపీ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ దిలావర్పూర్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Tags: Non-stop concerns in Basra

Post Midle
Post Midle