ట్రిపుల్ ఐటీలో ఆగని అందోళనలు

బాసర ముచ్చట్లు:

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ క్లాస్‌లను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.తమ సమస్యలపై స్పందించాలని మంత్రి కేటీఆర్‌కు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు లేవనెత్తిన అన్ని అంశాలను.. సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని తరగతులకు హాజరుకావాలన్నారు మంత్రి కేటీఆర్.

 

Tags: Non-stop concerns in Triple IT

Leave A Reply

Your email address will not be published.