Date:15/01/2021
హైదరాబాద్ ముచ్చట్లు:
అమెరికా వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చికాగోకు నాన్‌స్టాప్ విమానం ప్రారంభమైంది. మధ్యలో ఎక్కడా ఆగకుండా ఈ విమానం ప్రయాణిస్తోంది. దీంతో కొంత సమయం తగ్గుతోంది.శం్షాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి చికాగోకు నాన్‌స్టాప్ విమానాన్ని ఎయిరిండియా శుక్రవారం ప్రారంభించింది. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానం చికాగో బయల్దేరనుంది. చికాగో నుంచి ప్రతి బుధవారం హైదరాబాద్‌కు మరో విమానం బయల్దేరనుంది. అయితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే కనీసం ఒకట్రెండు చోట్ల విమానాలు ఆగేవి. కానీ ఎయిరిండియా నాన్ స్టాప్ విమానం ప్రారంభించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శంషాబాద్ నుంచి నేరుగా చికాగోకు విమాన సర్వీసును ప్రారంభిస్తున్నందుకు రాజీవ్ గాంధీ విమానాశ్రయం అధికారులను, ఎయిర్ ఇండియాకు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇతర ఖండాలకు వెళ్లడంలో మరిన్ని డైరెక్ట్ విమాన సర్వీసులకు ఇది ఆరంభమని మంత్రి కేటీఆర్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.
సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి
Tags;Non-stop flight from Hyderabad to Chicago