ఆగని పరువు హత్యలు

హైదరాబాద్ ముచ్చట్లు:

భువనగిరి జిల్లా లింగ రాజుపల్లికి చెందిన ఎరుకుల రామకృష్ణ మరో కులానికి చెందిన భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత కూడా భర్తను వదిలేయమని పలుమార్లు కూతురిని బెదిరించినా వినకపోవటంతో అల్లుడిని మట్టుబెట్టాలని మామ పల్లెపాటి వెంకటేష్‌ నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్‌ గ్యాంగ్‌కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి దారుణంగా చంపించాడు.సరూర్‌నగర్‌కు చెందిన బి.నాగరాజు అన్య మతానికి చెందిన అశ్రిన్‌ సుల్తానాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. దీంతో కక్ష కట్టిన అశ్రిన్‌ అన్నయ్య మహ్మద్‌ మొబిన్‌ అహ్మద్, తన బావ (మరో సోదరి భర్త) మహ్మద్‌ మసూద్‌ అహ్మద్‌తో కలిసి సరూర్‌నగర్‌లో నడి రోడ్డు మీద నాగరాజు పై సెంట్రిగ్‌ రాడ్, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడుగంబజార్‌ కోల్సావాడికి చెందిన నీరజ్‌ పన్వార్, వేరే కులానికి చెందిన సంజనను ప్రేమించాడు. వీరి ప్రేమను పెద్దలు నిరాక రించడంతో ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసు కొని పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో ఉంటు న్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వైరం మొదలైంది. శుక్రవారం రాత్రి నీరజ్‌ తాతతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. చేపల మార్కెట్‌ సమీపంలో నలుగురు దుండ గులు నీరజ్‌ను చుట్టుమట్టు కత్తులతో పొడిచి, రాళ్లతో మోది హత్య చేశారు. ఇలా భాగ్యనగరం పరువు హత్యలతో తల్ల డిల్లుతోంది. చంపేది, చంపించేది అండగా ఉండాల్సిన కుటుంబీకులే కావటం విషాద కరం.

 

 

 

Post Midle

తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తండ్రి, వేరే మతస్తుడిని మనువాడిందని అన్న, వేరే కులస్తుడిని వివాహం చేసుకుందని మొత్తం కుటుంబమే కక్షగట్టి పరువు హత్య లకు పాల్పడుతున్నారు.పోలీసులకు దొరికిపోతామని, అరెస్ట్‌ చేసి జైలుకెళతామని తెలిసినా ఏమాత్రం బెదరడం లేదు. పైకి ప్రేమను నటిస్తూనే ఎప్పుడు చంపాలి? ఎలా చంపాలి? పక్కా ప్రణాళికలు రచించి, అనువైన సమయంలో అంతమొంది స్తున్నారు. సొంత వారిని మట్టుబెట్టేందుకు నిందితులు సాంకేతికతను కూడా వినియోగి స్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ల కదలికలను ఆరా తీస్తున్నారు. నాగరాజు మర్డర్‌ కేసులో జరిగిందిదే. ఎలాగైనా చెల్లిలి భర్తను అంత మొందించాలని నిర్ణయించుకున్న మొబిన్‌.. నాగరాజు సెల్‌ఫోన్‌ను ట్రాక్‌ చేశాడు. ఇందు కోసం ఈ– మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను సం పాదించి తద్వారా సెల్‌ఫోన్‌ను ట్రాకింగ్‌ చేశా డు. అనువైన సమయం చూసి హత్య చేశాడు. పరువు హత్యలు జరుగుతున్నదో ఎక్కడో శివారు ప్రాంతాల్లో కాదు, నడిరోడ్ల మీద.

 

 

 

కిక్కిరిసిన ట్రాఫిక్‌లో ఏమాత్రం బెరుకు, భయం లేకుండా నిందితులు హత్య చేస్తు న్నారు. హత్య జరిగే సమయంలో చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడి యోలు తీస్తూ నిశ్చేష్టులుగా ఉండిపోతు న్నారు. సరూర్‌నగర్‌లో నడిరోడ్డు మీద నాగ రాజును మొబిన్‌ హత్య చేస్తుంటే సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ ఉండిపోయారే తప్ప ఒక్కరైనా స్పందించి ఉంటే తన భర్త నాగరాజు బతికే వాడని అశ్రిన్‌ రోదించడం, మనిషిలో మాన వత్వం చనిపోయిందనడానికి ఇదో ఉదాహరణ.ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారన్న అక్కసు తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. దీనికి తోడు బంధువులు, స్నేహితుల సూటిపోటి మాటలతో వారిలో కోపం మరింత కట్టలు తెంచుకుంటుంది. దీంతో హత్యలు చేయ డానికైనా, చేయించేందుకైనా వెనకా డట్లేదు. క్షణికావేశంలో హత్యలు చేసి, జీవితకాలం శిక్ష విధించుకుంటున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చట్టాలు, పోలీసులంటే గౌరవం, భయం లేకుండా పోయింది. పరువు హత్యల కేసుల్లో నిందితులు త్వరగానే పట్టుబడుతుండటం గమనార్హం.

 

Tags; Non-stop honor killings

Post Midle
Natyam ad