హాట్ సీట్ గా పాలేరు…

ఖమ్మం ముచ్చట్లు:

 

ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, ఖమ్మంజిల్లా పాలేరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. అందరూ నేతలు పాలేరుపై కన్నేసి.. పోటీకి చేయడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రం లోనే హాట్ సీట్ గా మారిన పాలేరులో ఎవరు పోటీ చేస్తారు. చివరికి పాలేరు గడ్డపై ఏ జెండా ఎగురుతుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్ట బోతున్నారన్నదీ వేచిచూడాలి.అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై స్పష్టత రాకపోవడంతో.. ఆమె సైతం పాలేరు నుంచే పోటీకి సై అంటున్నారు.

 

 

 

సిపిఎం పొత్తులో భాగంగా తమ్మినేని వీరభద్రం ఈ సీటు కావాలని పట్టు బడుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ పాలేరు టికెట్ కావాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకూ స్పష్టత రాకపోవడంతో కేడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పాలేరు.. ఇపుడు హాట్ సీట్ గా ఎందుకు మారింది.. నేతలు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో.. ఆయన నియోజక వర్గంలో ప్రచారంలో ముందున్నారు.

 

 

 

 

Post Midle

అక్టోబర్ 27న ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సైతం పాలేరు నుంచే బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఒక విధంగా పాలేరు పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తుంది.కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. పాలేరు నియోజకవర్గంపైనే చర్చ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో పాలేరు ఒకటి. ముఖ్య నేతలు ఎవరి మాట విన్నా.. పాలేరులో పోటీకి రెడీ.. దీంతో రాష్ట్రంలోనే పాలేరు హాట్ సీట్ గా మారింది. నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. వైఎస్ అభిమానులు, ఇతర సామాజిక వర్గాల ఓటు బ్యాంకు..కాంగ్రెస్ కు బలం.

 

 

 

మొన్నటి ఎన్నికల్లోనూ సీనియర్ నేత, బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇంత బలమైన సీటుపై కాంగ్రెస్ ముఖ్య నేతలు కన్నేశారు.. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కాంగ్రెస్ లో చేరడంతో.. ఇపుడు ఆ ఇద్దరు నేతలు పాలేరు సీటు కావాలని పట్టుపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో వారికి ఫాలోయింగ్ ఎక్కువే. జిల్లాలో ప్రభావితం చేయగలిగే ఇద్దరు బలమైన నేతలు ఒక్కటయ్యారు. తమను దూరం చేసుకున్న బీఆర్‌ఎస్‌ను ఓడించి దెబ్బ కొట్టాలని.. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు..పాలేరులోనూ.. ఇద్ద లో ఎవరు పోటీ చేసినా గట్టి పోటీ తప్పదు! ఇంత హాట్ సీట్ గా మారిన పాలేరులో బీఆర్ఎస్ గెలుపు కోసం ఏ వ్యూహం అమలు చేస్తోంది.

 

 

 

ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారన్నదీ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిది లోకల్. పాలేరు నియోజక వర్గమే. షర్మిల, తుమ్మల, పొంగులేటి.. వీరంతా నియోజక వర్గానికి నాన్ లోకల్. ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.. ఈ అంశమే అధికార పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ షర్మిల ఎంట్రీతో పాలేరు పాలిటిక్స్ హీటేక్కాయి. గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల. ఆ తర్వాత పాలేరు నియోజక వర్గానికి పూర్తిగా దూరమయ్యారు. ఎలాంటి కార్యక్రమాలు లేకుండా సైలెంట్ కావడంతో.. ఆమె పాలేరు నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం జోరుగా జరుగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి సడన్ ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కరించి..

 

 

విగ్రహం సాక్షిగా పాలేరులోనే పోటీ చేస్తా అని ప్రతిజ్ఞ చేశారు. వెనక్కి తగ్గేదీలేదంటూ.. పోటీ పై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ లో 3,600 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై చర్చలు జరిపారు. కానీ.. ఇప్పటి వరకూ స్పష్టత రాక పోవడంతో..ఆమె తన పార్టీ నుంచే పాలేరులో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. పాలేరు బిడ్డను..ఇక్కడ నుంచే పోటీ చేస్తానని.. ఆమె మట్టి పట్టుకొని మరీ మాట ఇచ్చారు.

 

Tags:Not a hot seat…

Post Midle