ఒంటరిని కాను ..ప్రజాస్వామికవాదుల అండతో పోటీ

కరీంనగర్ ముచ్చట్లు:

 

తాను ఒంటరిగా బరిలో దిగనని… ప్రజాస్వామికవాదుల అండతో పోటీ చేస్తున్నానన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు, ఈటలకు మధ్య, అన్యాయానికి, న్యాయానికి మధ్య జరుగుతున్నాయి. ఓటుకు టీఆర్ఎస్ లక్ష ఇచ్చినా.. తనకే వేస్తాం అంటున్నారని ఈటల వెల్లడించారు.13, 14 తేదీల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. శనివారం హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలపూర్ మండలం గోపాల్ పూర్ నుంచి తన పాదయాత్ర ఉంటుందన్నారు. ఆ పాదయాత్రలో అన్ని గ్రామాలను కవర్ చేస్తానన్నారు. భారీ సభ కూడా ఉంటుందన్నారు. 350 నుంచి 400 కిలోమీటర్లు తన పాదయాత్ర ఉంటుందన్నారు. పోల్ మేనేజ్మెంట్‌ను పోలీసులు చూసుకుంటున్నారన్నారు. మఫ్టీ పోలీసులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటున్నారన్నారు. కేసీఆర్‌ను తిట్టిన వారు ఆయన పక్కన కూర్చున్నారని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న వారు బయటకు వెళ్లారన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Not alone .. Competing with the egg of democrats

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *