వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: సుష్మా స్వరాజ్

Not contesting elections: Sushma Swaraj
Date:20/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తన రాజకీయ భవిష్యత్తుపై ఇవాళ ఓ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. మధ్యప్రదేశ్లో పాత్రికేయులతో మాట్లాడిన ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుష్మా వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న అంశాన్ని వాస్తవానికి పార్టీనే నిర్ణయిస్తుంది. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయించినట్లు సుష్మా తెలిపారు. తన నిర్ణయాన్ని పార్టీకి కూడా తెలియజేసినట్లు ఆమె చెప్పారు. విదిషా నియోజకవర్గం నుంచి సుష్మా లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
Tags:Not contesting elections: Sushma Swaraj