విమర్శలు కాదు…అభివృద్ధికి సహకరించండి -మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంతోనే అభివృద్ధి

-ఎల్లో మీడియా వార్తలు అర్థరహితం
– ఎవరైన సరే అభివృద్ధిపై పరిశీలనకు రండి
– వైఎస్సార్‌సీపీ నేతల సవాల్‌

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాల్సిన ప్రతిపక్ష నాయకులు , ఎల్లో మీడియా కావాలని అర్థరహితంగా విమర్శలు చేయడం బాధకరమని , అభివృద్ధిపై చర్చకైనా…పరిశీలనకైన దమ్ముంటే రావాలని పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ప్రతిపక్షాలకు , ఎల్లోమీడియాకు సవాల్‌ విసిరారు. శనివారం సాయంత్రం మండలంలోని ఆరడిగుంట వద్ద శ్రీకాళహస్తి పైపుల ప్యాక్టరీ పనులను పరిశీలించి, విలేకరుల సమావేశాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి నిర్వహించారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన హామి మేరకు పుంగనూరు అభివృద్ధికి వేలాది కోట్లు విడుదల చేశారన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఓవైపు అభివృద్ధి, మరో వైపు పరిశ్రమల ఏర్పాటు శరవేగంగా జరుగుతోందని కొనియాడారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. 30 సంవత్సరాలుగా పుంగనూరును పాలించి ఏమి అభివృద్ధి చేశారని నిలధీశారు. కనీసం ఆర్టీసి బస్టాండును కూడ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. పరిశ్రమలశాఖ మంత్రిగా ఆయన చేయలేని కార్యక్రమాలను మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌లు చేస్తున్నారని తెలిపారు. శ్రీకాళహస్తి పైపుల ప్యాక్టరీ పనులు జరుగుతున్నాయని,

 

 

 

దమ్ముంటే పరిశీలనకు రావాలన్నారు. అలాగే పెప్పర్‌ కంపెనీ వారు రూ.5 వేల కోట్లతో ఆరడిగుంట వద్ద 800 ఎకరాలలో ప్యాక్టరీ నిర్మిస్తారన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో పలమనేరు నియోజకవర్గం కూడ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వీటిపై అసత్య ఆరోపణలు చేయడం, అభివృద్ధిని అడ్డుకోవడం మంచిదికాదన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో కొన్ని సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. అందరి సమ్మతంతోనే భూసేకరణ జరుగుతోందని , రైతులకు తగినంత నష్టపరిహారం అందిస్తూ పరిశ్రమలకు భూమి కేటాయించాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల సమయాల్లో చేయాలని, ఐదేళ్లు రాజకీయాలు చేస్తే ప్రతిపక్షాలను ప్రజలు మట్టికరిపిస్తారని హెచ్చరించారు. ఎవరైనా అభివృద్ధికి సహకరించి, సూచనలు, సలహాలు ఇస్తే సరైనవైతే ఆమోదిస్తామన్నారు. అభివృద్ధి కోసం సహకారం ఇవ్వకుండ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని, తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మండల పార్టీ కార్యదర్శి రెడ్డెప్ప పాల్గొన్నారు.

 

Tags:Not criticism…cooperate for development – development with Minister Peddireddy’s family

Post Midle