‘రాజకీయాల కోసం కాదు.. ప్రజల కోసమే మా ఫ్రంట్’

'Not for politics, our front for people'

'Not for politics, our front for people'

-తెలంగాణ సీఎం కేసీఆర్‌
Date:13/04/2018
బెంగళూరు  ముచ్చట్లు:
జనతాదళ్‌ (ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని అధినేత దేవెగౌడతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు సహా పలు అంశాలపై శుక్రవారం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ‘ఎల్లారిగీ నమస్కార’ అంటూ కేసీఆర్ కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో గొప్ప మార్పులు సంభవించాల్సి ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని 65 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాలించాయని… దేవేగౌడ, వీపీ సింగ్, చంద్రశేఖర్, చరణ్ సింగ్, మొరార్జీ తదితరులు కొంత కాలం దేశాన్ని పాలించారని చెప్పారు.అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తాను దేవెగౌడను కలిశానని, అప్పుడు కూడా ఆయన మద్దతు పలికారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ‘రాజకీయాల కోసం కాదు.. ప్రజల కోసమే మా ఫ్రంట్’ అని కేసిఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ… దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌, బీజేపీ విఫలమయ్యాయని, 65 ఏళ్లలో పాలకులు తాగునీటిని కూడా అందించలేకపోయారన్నారు. కావేరి సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించలేకపోయారని, కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ పరిష్కారం చూపలేదన్నారు. దేశంలో మొత్తం సాగుభూమికి నీరు ఇచ్చినా 30 వేల టీఎంసీలు మిగులుతాయని, అసమర్ధ పాలన వల్లే నీటి సమస్యలు తలెత్తుతున్నాయని కేసీఆర్ అన్నారు. కర్ణాటక ప్రజలు జేడీఎస్‌కు మద్దతు తెలపాలని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేవెగౌడ ప్రశంసించారని కేసీఆర్ అన్నారు.70 ఏళ్లుగా దేశంలో ఎన్నో సమస్యలను కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు పరిష్కరించలేక పోయాయన్నారు. తమిళనాడు, కర్ణాటక మధ్య ఉన్న జల వివాదాలను కేంద్రం ఎందుకు పరిష్కరించడంలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. జల వివాదాలను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాల మధ్య కేంద్రం యుద్ధ వాతావరణం సృష్టిస్తోందని ఆరోపించారు. కృష్ణా జలాల పరిష్కారానికి 2004లో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. 14 ఏళ్లు గడిచినప్పటికీ కృష్ణా జలాల వివాదాన్ని ఆ ట్రైబ్యునల్‌ పరిష్కరించలేకపోయిందని చెప్పారు. నీళ్ల కోసం రాష్ట్రాలు కొట్టుకుంటుంటే దిల్లీలోని కేంద్ర పాలకులు చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. తృతీయ కూటమి అనేది సొంత రాష్ట్రాల అభివృద్ధి కోసం మాత్రమే కాదని, దేశ వ్యాప్తంగా గుణాత్మక మార్పుల కోసమేనని పునరుద్ఘాటించారు.మీడియా సమావేశంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీనటుడు ప్రకాశ్‌రాజు సహా పలువురు పాల్గొన్నారు.
Tags:’Not for politics, our front for people’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *