మందులే కాదు… మనోధైర్యం కూడా ముఖ్యమే-సర్పంచులు తిమ్ములమ్మ, వనజమ్మ

పుంగనూరు ముచ్చట్లు:

 

మందులే కాదు మనోధైర్యం కూడా అవసరమేనని ఏటవాకిలి, మంగళం సర్పంచులు తిమ్ములమ్మ, వనజమ్మలు అన్నారు. మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల ఆదేశాల మేరకు రెండు పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఇంటింటికి తిరిగి జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే కరోన భారిన పడిన వారికి పలు జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన భారిన పడిన వారు అధైర్య చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సకాలంలో స్పందించాలని మంత్రి అధికారులను ఆదేశించారన్నారు. అదే విధంగా సర్పంచులు తిమ్ములమ్మ, వనజమ్మలు కూడా పంచాయతీలలో నమోదు అవుతున్న కరోన కేసుల వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయట తిరక్కుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహబూబ్ బాషా, కెసిపల్లి సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి, ఉప సర్పంచులు వెంకటరమణ, వేణు, ఏఎన్ఎం మాలిని, వసంత, స్థానిక నేతలు విశ్వేశ్వరరెడ్డి, రాంమోహన్ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సుబ్రహ్మణ్యం, నాగభూషణం, గోపాల్ రెడ్డి, నందకుమార్ రెడ్డి, వాలింటర్ నాగేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Not only medicines … Courage is also important – Sarpanches Thimmulamma and Vanajamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *