అవమానించడని… ఫ్రెండ్ నే చంపేశాడు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ట్టుమని పాతికేళ్లు కూడా లేని ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం అది హత్యకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్ నగర్‌‌లో చోటు చేసుకుంది. స్నేహితుడు తన పట్ల అనుచితంగా వ్యవహరించడంతో పాటు తరచూ అవమానకరంగా మాట్లాడుతుండడంతో బాగా కోపం తెచ్చుకున్న యువకుడు కత్తితో పొడిచి స్నేహితుణ్ణి హతమార్చేశాడు. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది.సనత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన సచిన్‌ (22), నరేందర్‌ (21) బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. రోడ్ల వెంబడి చిత్తు కాగితాలు ఏరుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవ పడుతుండేవారు. కొన్నాళ్ల క్రితం నరేందర్‌ కాలు విరగడంతో అతని కాలులో మెటల్ రాడ్‌ వేయాల్సి వచ్చింది. దీనిని వేలెత్తి చూపిస్తూ నువ్వు దేనికీ పనికిరావు అంటూ సచిన్‌ అవమానిస్తుండేవాడు.స్నేహితుడి మాటలు విని పదే పదే మనసు నొచ్చుకున్న నరేందర్‌.. సచిన్‌పై బాగా కోపం పెంచుకున్నాడు. అతణ్ని ఎలాగైనా చంపాలనుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మద్యం మత్తులో వీరిద్దరూ ఫతేనగర్‌ ప్రాంతంలోని ఎన్‌బీఎస్‌ నగర్‌లో కలుసుకున్నారు. ఒంటరిగా ఉన్న సచిన్‌ను హతమార్చేందుకు ఇదే అదనుగా భావించి అతడిపై నరేందర్‌ కత్తితో దాడి చేశాడు. ఛాతీ, గుండె భాగాల్లో పొడవడంతో తీవ్రంగా గాయపడిన సచిన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి బంధువు అనిల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Not to be insulted … killed a friend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *