నోటరీ విధానం ఇక పక్కా: ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో..

నోటరీలకు త్వరలో యూనిక్‌ ఐడీలు

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ

అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు

 

 

అమరావతి ముచ్చట్లు:

 

 

నోటరీలు పారదర్శకంగా పనిచేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. కొందరు నోటరీలు తప్పుడు స్టేట్‌మెంట్లను నోటిఫై చేస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరికొందరు లైసెన్సు లేకపోయినా నోటరీ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. వీటివల్ల నోటరీలు చేయించుకున్న వ్యక్తులు ఇబ్బందులు పడటంతోపాటు వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నోటరీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ నడుం బిగించింది. నోటరీలు ఇచ్చే అఫిడవిట్లు, ఇతర సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది.ఇకపై ప్రతి నోటరీకి వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చి వారు జారీ చేసే సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే లైసెన్సు ఉన్న ప్రతి నోటరీకి ఒక యూనిక్‌ ఐడీ ఇవ్వనున్నారు. నోటరీలు జారీచేసే అఫిడవిట్లపై ఈ యూనిక్‌ ఐడీ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు, విచారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు అవకాశం ఉంటుంది. నోటరీలను పర్యవేక్షించేందుకు ఈ రెండు చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అవతవకలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. రెండు నెలల్లో వీటిని అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Notary system is now complete: with special software ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *