502 పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్‌

విజయవాడ  ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 502 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఆగ‌స్టు 21న‌  ఓ ప్రకటనలో వెల్లడించింది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్స్‌), ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెల్పింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు  అందుబాటులో ఉంచనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ యస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లిమిటెడ్ రిక్రూట్ మెంట్-2022 వివరాలు నేడు విడుదల చేయనున్నారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

 

Tags: Notification for filling up 502 posts

Leave A Reply

Your email address will not be published.