ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి.. నోటిఫికేషన్‌

అమరావతి ముచ్చట్లు:

 

ఎంబీబీఎస్, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని, డాక్టర్‌ ఎన్టీఆర్‌, ఆరోగ్య యూనివర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేశాయి

కౌన్సెలింగ్, ఎంపిక ప్ర‌క్రియ‌ దేశ‌ వ్యాప్తంగా..

@ తొలి కౌన్సెలింగ్‌కు ఆగ‌స్ట్ 14 నుంచి 21వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. అనంత‌రం, ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంపికైన వారు ఆగస్టు 24 నుంచి 29వ తేదీల్లో కాలేజీల్లో చేరాలి.

@ రెండో విడ‌త‌ కౌన్సెలింగ్‌కు సెప్టెంబరు 5వ తేదీన ద‌ర‌ఖాస్తులు ప్రారంభం అవుతాయి. అదే నెల‌ 13న ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్‌ 14 నుంచి 20లోపు విద్యార్థులు కాలేజీల్లో చేరాలి.

@ మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 16 నుంచి 20 వరకు ఉండ‌గా అక్టోబరు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు సెప్టెంబర్‌ 24 నుంచి 30వ తేదీలోపు కాలేజీల్లో చేరాలి.

నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో ప్ర‌వేశ పెట్టాల్సిన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు ఇవే..
➤నీట్‌ యూజీ 2024 ర్యాంక్‌ కార్డు, అడ్మిట్‌ కార్డు, డొమిసైల్ సర్టిఫికేట్
➤పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో
➤6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
➤ఇంటర్మీడియట్‌ స్టడీ, పాస్‌ సర్టిఫికెట్లు
➤మైగ్రేషన్ సర్టిఫికెట్‌
➤మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌
➤పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
ఇవి ఖచ్చితంగా ఉండాలి
➤ఇంటర్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
➤కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌
➤ఆధార్‌ కార్డు
➤ఇన్‌కాం సర్టిఫికెట్‌
➤దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ సర్టిఫికెట్‌.

 

Tags: Notification for MBBS and BDS Convener Quota Seats

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *