ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల నోటిఫికేషన్‌ జారీ

Date:02/07/2019

 

అమరావతి ముచ్చట్లు:

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు సిద్ధమయ్యారు.ఈ నెల 8వ తేదీ వరకు ఈ వెరిఫికేషన్‌ జరుగుతుంది.ఈ మేరకు వర్సిటీ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.సర్టిఫికెట్‌ పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, కాకినాడలలో సెంటర్లు ఏర్పాటు చేశారు.విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో వెరిఫికేషన్‌ జరుగుతుంది.తెలంగాణ, కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థులు విజయవాడ సెంటర్‌కు రావాల్సి ఉంది.దివ్యాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, క్యాప్‌, పోలీస్‌ పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లను కేవలం విజయవాడ ఎన్టీఆర్‌ వర్సిటీలోనే పరిశీలిస్తారు.

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.

 

Tags: Notification for MBBS and BDS courses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *