NRC and CAA are not anti-Muslims

ఎన్‌ఆర్‌సీ, సీఏఏలు ముస్లింలకు వ్యతిరేకం కాదు

– ప్రధాని సోదరుడు ప్రహ్లాదమోది

Date:24/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని , మ్యానిఫెస్టోలో పేర్కొన్న మేరకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రధాని సోదరుడు ప్రహ్లాదమోదీ దామోదర్‌దాస్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష పార్టీలు బిజెపి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌సీ, సీసీఏ, ఎన్‌పీఆర్‌లు ముస్లిం మతానికి వ్యతిరేకం కాదని, వీటిని ముస్లింలు అవగాహన చేసుకుని శాంతియుతంగా ఉండాలని , ఇందులో అపోహాలకు తావులేదని తెలిపారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం జరుగుతుందని , తప్పుడు ప్రకటనలు నమ్మవద్దని ముస్లింలను కోరారు. ఈ సమావేశంలో సినినటి కవిత, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌, పార్టీ స్థానిక నేతలు అయూబ్‌ఖాన్‌, గణేష్‌, రాజారెడ్డి , రాజాజెట్టి తదితరులు పాల్గొన్నారు.

సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు వద్దకు ప్రజలు వెళ్లరాదు

Tags: NRC and CAA are not anti-Muslims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *