తెలంగాణ కోసం ఎన్నారైల సేవలు మరువలేనివి

NRI services for Telangana are unforgettable

NRI services for Telangana are unforgettable

Date:12/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రస్తుతం 33 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్స్ ఉన్నాయి.  రానున్న రోజుల్లో 100 దేశాల్లో శాఖలు ఏర్పాటు చేస్తాం. ప్రో.జయశంకర్ సార్  స్పూర్తితో  విదేశాల్లో తెలంగాణ కోసం వివిధ పేర్ల లో ఎన్ఆర్ఐలు సంఘాలు పెట్టి పనిచేసారని ఎంపీ కవిత అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో  లండన్ ఎన్ఆర్ఐల సంఘం ఎనిమిదో వార్షికోత్సవ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో సోషల్ మీడియా కేంద్రంగా  ఎన్ఆర్ఐలు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. నవ్విన నాపచేను పండినట్టుగా  తెలంగాణ సాధించాం. సాధించిన రాష్ట్రంలో గులాబి జెండా ఆధ్వరంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని అన్నారు. కేసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేసి తెలంగాణ బిడ్డల అండతో  రెండోసారి కూడా అధికారంలోనికి వచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాల్లో  దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం.
మన పారిశ్రామిక పాలసీ చూసి అమోరికాలో కూడా ఇంతమంచి పాలసీ లేదని అక్కడి వారు అంటున్నారు. తెలంగాణ ను చూసి ప్రభుత్వ పనితీరు,  అభివృద్ది చెందుతున్న విధానం చూసి మీరు గర్వపడేలా చేస్తామని కవిత అన్నారు. ఎన్ఆర్ఐ ల సంక్షేమం కోసం 100 కోట్ల ఇప్పటికే మంజూరు అయి ఉన్నాయి. గల్ప్ లాంటి దేశాల్లోనికి వారికి సహాయ సహకారం చేసేలా ఉంటాం. కేటీఆర్ నేతృత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ రూపొందిస్తున్నారు. మీరందరూ తలెత్తుకుని నిలబడేలా… గర్వపడేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె అన్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఇక్కడ పార్టీకీ..అక్కడ మన వారికి వారధిలా ఉండాలి.  ఉద్యమ స్పూర్తిని వీడకుండా ఎన్ఆర్ఐ లు  పనిచేయాలి.  మనమంతా కలిసి  పనిచేస్తే దేశానికి, ప్రపంచానికి  తెలంగాణ ఆదర్శవంతంగా నిలుస్తదని కవిత అన్నారు.
Tags:NRI services for Telangana are unforgettable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *