పాఠశాలలకు ఎన్‌ఆర్‌ఐ సుబ్రమణ్యం విరాళం

NRI Subramaniam donates to schools

NRI Subramaniam donates to schools

Date:17/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సామాగ్రీని పంపిణీ చేశారు. మంగళవారం ఏటవాకిలి గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు సుబ్రమణ్యం, వంశికృష్ణ, నరేష్‌, శిరీష్‌, సాంబయ్య, మిత్రులు కలసి రూ.70 వేలు విలువ చేసే పాఠశాలలకు అవసరమైన వస్తువులను ఎంఈవో లీలారాణి చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐలు పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతియేటా తమ శక్తి మేరకు వస్తువులను విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజునాథ్‌, శ్రీధర్‌, మదుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

19న శ్రీరామానంద సరస్వతి రాక

Tags: NRI Subramaniam donates to schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *