ఎన్టీఆర్ వర్ధంతి ఏర్పాట్లపై  సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

NT Chandrakabu teleconference on the arrangements of NTR

NT Chandrakabu teleconference on the arrangements of NTR

టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు
Date:12/01/2019
అమరావతి ముచ్చట్లు:
ఈనెల 18వ తేది నిర్వహించనున్న ఎన్టీఆర్ వర్ధంతి ఏర్పాట్లపై  సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వాహించారు.  ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ఈనెల 18వ తేది ఎన్టీఆర్ 23వ వర్ధంతి ఘనంగా జరపాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో లెజండరీ రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. నాయకులు,కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు. నాలుగేళ్లుగా లెజండరీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దంత వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు జరుపుతున్నాం. ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ రావడం ఒక మైల్ స్టోన్. ఎన్టీఆర్ బయోపిక్  అందరికీ స్ఫూర్తినిస్తుంది. మిగిలిన వాళ్లది అందరి మాదిరిగా ఒక కథ. కానీ ఎన్టీఆర్ ది మాత్రం ఒక చరిత్ర. ఎన్టీఆర్ వర్ధంతిని చారిత్రాత్మకంగా జరపాలి. దీనిని పేదల పండుగగా చేయాలని అయన అన్నారు. పేదల సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. అతిగొప్ప మానవతావాది ఎన్టీఆర్. తనది మానవతావాదమని గర్వంగా చెప్పారు.
ఎన్టీఆర్ ఆశయాలను చిత్తశుద్దితో అమలు చేస్తున్నాం. పేదల సంక్షేమాన్ని తరువాత దశకు చేర్చాం. ఒకవైపు సంపద సృష్టిస్తున్నాం. పేదలకు సంక్షేమం పెద్దఎత్తున చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు ఆదాయం వచ్చేలా కృషి చేయాలని అన్నారు. నాలుగున్నరేళ్లలో పించన్ 10రెట్లు చేశాం. రూ.200 నుంచి రూ.2వేలకు పెంచాం. పేదల్లో 10రెట్లు సంతృప్తి నింపాం. పించన్లు నిరుపేదలకు ‘ఎన్టీఆర్ భరోసా’గా చేశాం. వికలాంగులకు నెలకు రూ.3వేలు ఇస్తాం. డయాలసిస్ పేషంట్లకు రూ.3,500ఇస్తామని అన్నారు. రైతులకు 9గం కరెంటు సరఫరా ప్రకటించాం. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం.  అవినీతి రహిత రాష్ట్రాలలో 3వ స్థానం సాధించామని అన్నారు. పేదలకు సంక్షేమంలో అగ్రగామిగా ఉన్నాం.
రాజశేఖర రెడ్డి హయాంలో పించన్  రూ.200మాత్రమే. పేదలకు పెద్దగా చేసిందేమీ లేదు. ప్రచారం మాత్రం రెట్టింపు చేసుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ రెట్టింపు చేశాం. రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచాం. చంద్రన్న బీమా రూ.5లక్షల వరకు ఇస్తున్నాం. ఎన్టీఆర్ విదేశీవిద్య రూ.15లక్షలకు పెంచాం.  యువనేస్తం కింద నెలకు రూ.1,000 నిరుద్యోగ భృతి. ప్రభుత్వ లబ్ది దుర్వినియోగం చేయరాదు. అర్హులకే సంక్షేమ పథకాల లబ్ది అందాలి. కేంద్రం తోడ్పాటు లేకున్నా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కరోజే రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, లక్షా 30వేల ఉపాధి చరిత్ర. విశాఖలో రూ.70వేల కోట్లతో డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కుల అభివృద్ధి. ప్రకాశంజిల్లాలో రామాయ పట్నం వద్ద కాగిత గుజ్జు పరిశ్రమ, ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభించాం. దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపన చేశాం.
కుప్పం ఎయిర్ పోర్ట్ అభివృద్ది.  రూ.62వేల కోట్లతో కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ వస్తున్నాయని అన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జన్మభూమి విజయవంతం చేశాం. 16వేల గ్రామాభివృద్ధి ప్రణాళికల తయారీ రికార్డు. 15% వృద్ధి రేటు మన లక్ష్యం. పాదయాత్ర కాదు జగన్ ది విలాసయాత్ర. ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్లాడు. 208రోజులు ఇంటికెళ్లకుండా నేను పాదయాత్ర చేశాను.  పవిత్ర లక్ష్యంతో పాదయాత్ర చేశానని గుర్తు చేసారు. పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారు. ప్రత్యేక హోదా గురించి జగన్ మాట్లాడటం లేదు. కెసిఆర్ తో కలిసి ఏపికి హోదా సాధిస్తా అన్నాడు. అక్కడే జగన్ చిత్తశుద్ది ప్రజలకు అర్ధం అయ్యిందని చంద్రబాబు అన్నారు.
Tags:NT Chandrakabu teleconference on the arrangements of NTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *