ఎన్టీఆర్ బయోపిక్ లో ఆర్ఎక్స్ భామ

NTR bio on the NTR biopic

NTR bio on the NTR biopic

Date:26/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
‘ఆర్ఎక్స్ 100’ అంద చందాలతో కుర్రకారును పిచ్చెక్కించిన పాయల్ రాజ్‌పుత్.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత అవకాశాలు వస్తున్నా.. ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామ ఈ సినిమాలో ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసిందట. ఈ సినిమాను క్రిష్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో ఎన్టీఆర్‌‌ తెలుగు చలన చిత్ర రంగంలో మహా నటుడిగా ఎలా ఎదిగారనేది చూపనున్నారు. రెండో భాగంగా ఆయన మహా నాయుకుడిగా రాజకీయాలను ఎలా ఏలారనేది చూపనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు ప్రధాన పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది. తాజాగా ప్రముఖ నటి జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్‌పుత్‌ను చిత్రయూనిట్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే, దీనిపై చిత్రయూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాయల్ ప్రస్తుతం తమిళంలో ‘యాంజిల్’, ‘ఇరువర్ ఉల్లం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.
Tags:NTR bio on the NTR biopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *