ఎన్టీఆర్ శతజయంతి క్యాలెండర్ అవిష్కకరణ
కాకినాడ ముచ్చట్లు:
ఎన్టీఆర్ శతజయంతి క్యాలెండర్ ఆవిష్కరణ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వీరాభిమాని తురగా సూర్యారావు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గొప్ప నటుడే గాక ప్రజా నాయకు డని అన్నారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానేత ఎన్టీ రామారావు అని అన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలించి ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ పథకాలను అమలుపరిచిన గొప్ప నేత అని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు, బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద లక్షలాది గృహాలు నిర్మాణం వంటి పలు సంక్షేమ పథకాలను అమలుపరిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీ రామారావు అని సూర్యారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, మాణిక్ రెడ్డి సత్యనారాయణ, శిరీష, రేలంగి బాపిరాజు, అడబాల సత్యనారాయణ ,సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Tags: NTR centenary calendar unveiled

