ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

గుంటూరు ముచ్చట్లు:
 
టీడీపీ వ్యవస్థపాకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో కల కలం రేపింది.దుర్గి గ్రామా నికి చెందిన శెట్టిపల్లి కోటేశ్వ రరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహా న్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికు లు గమనించే సరికే విగ్రహం స్వల్పంగా పగిలింది. సమాచారమందుకున్న దుర్గి ఎస్.ఐ పాల్ రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ యలమంద కుమారుడిగా పోలీసులు గుర్తించా రు. విగ్రహం ధ్వంసం చేసేందుకు యత్నించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాడి ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడ్ని అరెస్టు చేశారు. కోటేశ్వరరావుపై పోలీసు లు కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం దారుణ మన్నారు.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: NTR statue destroyed

Natyam ad