రావిచర్లలో ఎన్టీఆర్ వర్ధంతి
నూజివీడు ముచ్చట్లు:
నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్, గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి నిర్వహించారు. రావిచెర్ల గ్రామంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి కాపా శ్రీనివాసరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నటసార్వభౌమ, విశ్వ విఖ్యాత నటుడు, దివంగత ఎన్టీఆర్ తెలుగు జాతిఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందేలా తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం సాధించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 గడుస్తున్నా, ఇప్పటికీ రాష్ట్ర ప్రజల గుండెల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయాడని శ్రీనివాసరావు అన్నారు.
Tags; NTR’s death among the Ravichars

