Natyam ad

దేశంలో 1892కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు చేరింది. వీరిలో 766 మంది ఒమిక్రాన్ పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 568 ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. దేశరాజధాని ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 152, తమిళనాడులో 121, తెలంగాణలో 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63, ఒడిశాలో 37, పశ్చిమ బెంగాల్‌లో 20,ఆంధ్రప్రదేశ్‌లో 17, మధ్యప్రదేశ్‌లో 9, యూపీలో 8, ఉత్తరాఖండ్‌లో 8, గోవాలో 5, చండీగఢ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌, మణిపూర్, పంజాబ్‌లలో ఒక్కొక్కటిగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Number of Omicron cases in the country since 1892