స్వచ్చ సర్వేక్షణ్ లో నంబర్ వన్ స్థానం

Number one position in pure survey

Number one position in pure survey

Date:12/01/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని వినూత్నమైన రీతిలో నిర్వహించారు శేరిలింగంపల్లి జోన్ జీహెచ్ యంసి అదికారులు. సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడేలా ముగ్గులు, పతంగులతో నగర ప్రజలను ఉత్తేజపరిచే విదంగా నిర్వహించారు. చిన్న పిల్లల్లకు చోటా భీమ్, చుట్కీ ప్రదాన ఆకర్షణగా నిలిచారు. స్వచ్చ సర్వేక్షణ్ లో నగరానికి మెరుగైనా ర్యాంకు రావాలని, ప్రజలందలరు ఈ కార్యక్రమం లో భాగస్వాములను చేయలన్న ఉద్దేశ్యంతో శేరిలింగంపల్లి జోన పరిధిలోని  చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు.. ముగ్గుల పోటీలు.. కైట్ ఫెస్టివల్ ను జిహెచ్ యంసి అదికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే గాంధీ, స్థానిక కార్పొరేటర్లు, జోనల్ కమీషనర్ హారిచందన పాల్గొన్నారు.  మేయర్ మాట్లాడుతూ హైద్రాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నయన్నారు.  హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాడానికి కృషి చేస్తున్నామన్నారు.  పండుగలో కూడా స్వచ్ఛ సర్వేక్షన్ ను కలిపి జరుపు కోవాలన్నరు. అన్ని ప్రాంతాల్లో ని సంస్కృతులను కలిపి పండుగ జరుపుకుంటమన్నారు. హైదరాబాద్ ను స్వచ్ఛ సర్వేక్షన్ లో నెంబర్ వన్ గా నిలపడానికి ప్రతి ఒక్కరి  కృషి అవసరమని అయన అన్నారు
Tags:Number one position in pure survey

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *