వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరి

– నిబంధనలు ఉల్లంఘిస్తే కటిన చర్యలు
– రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ప్రవీణ్ కుమార్

పెద్దపల్లి  ముచ్చట్లు:
ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘిస్తే కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది బుధవారం గోదావరిఖనిలో నెంబర్ ప్లేట్స్ లేకుండా, నూతనంగా తీసుకున్న వాహనాలకు టి.ఆర్. నెంబర్ వేయించకుండా తిరుగుచున్న, నెంబర్ ప్లేట్ ని వంచడం, స్టిక్కెర్లు అతికించడం, రిజిస్ట్రేషన్ నెంబర్ చెరిగిపోయి కనిపించకుండా ఉన్నటువంటి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను పోలిస్ స్టేషన్ కి తరలించి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. నూతనంగా వాహనం తీసుకున్న వెంటనే టి.ఆర్ (తాత్కాలిక నెంబర్) ఇవ్వడం జరుగుతుందనీ, వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేంత వరకు టి.అర్ నెంబర్ కచ్చితంగా వాహనంపై వేసుకోవలన్నరు. కొంత మంది వాహనదారులు ఉద్దేశ పూర్వకంగా ఈ చాలన్ నుండి తప్పించుకోవడానికి, ఇతర దురుద్ధేశాలతో వాహనాలపై నెంబరు తీసివేయడం కానీ, వాటిపై స్టిక్కెర్లు అంటించడం, నెంబర్ ప్లేట్ ని వంచడం, రిజిస్ట్రేషన్ నెంబర్ చెరిగిపోయి కనిపించకుండా ఉండటం, నెంబర్ ప్లేట్ వేసుకోకుండా వాహనాలను నడిపిస్తున్నారనీ, ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటుగా క్రిమినల్ కేసులు కూడా నమోదుచేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 30 వాహనాలు పట్టుబడగా, రూ.38,500 జరిమానా విధించారు. అనంతరం నెంబర్ ప్లేట్స్ బిగించే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాహనాలకు నెంబర్ ప్లేట్లు వేయించిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి, వాహనాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కమలాకర్, సూర్యనారాయణ, ఏఎస్సై వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Number plate mandatory for vehicles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *