Nutrition f

ఇంటింటికి పౌష్ఠికాహారం

Date:04/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ లబ్ధిదారులకు బాలసంజీవిని పౌష్ఠికాహారాన్ని ప్రతి ఇంటికి అందజేసినట్లు ఐసిడిఎస్‌ పీవో భారతి తెలిపారు. గురువారం పట్టణంలోని మేలుపట్లలో గర్భిణీలకు, బాలింతలకు జూన్‌ నెల కోటాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం, కందిపప్పు, నూనే, కోడిగ్రుడ్లు, పాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే 6 నెలల నుంచి 72 నెలలలోపు వయసు కలిగిన పిల్లలకు కూడ పౌష్ఠికాహారంతో పాటు బాలమృతము పంపిణీ చేశామన్నారు. తల్లులు పౌష్ఠికాహారాన్ని సక్రమంగా క్రమపద్దతిలో తీసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ఆయేషా నస్రిన్‌తాజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మరో క్షురకుడు ఆత్మహత్య

Tags: Nutrition f

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *