Nutrition is essential to stay healthy

ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పౌష్ఠికాహారం అవసరం

– ఎస్‌వో లక్ష్మీ

Date:21/09/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పౌష్ఠికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని సెట్విన్‌ సీఈవో , పుంగనూరు స్పెషలాఫీసర్‌ లక్ష్మీ అన్నారు. శనివారం మున్సిపాలిటిలో పౌష్ఠికాహార దినోత్సవాన్ని కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా చిత్తూరు ఎంపి రెడ్డెప్ప , మెప్మా పీడీ జ్యోతి, లయన్స్ క్లబ్  జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఐకెపి మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాల స్టాల్స్ను పరిశీలించారు. పూర్తి సేంద్రియ విధానంతో తయారు చేసిన రాగి సంగటి, జొన్న , సజ్జా రొట్టెలు, బెల్లంపొంగలితో పాటు కూరగాయలను తిని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పెషలాఫీసర్‌ లక్ష్మీ మాట్లాడుతూ మానవుని మనుగడ ప్రశ్నార్థకమౌతున్న తరుణంలో మున్సిపాలిటిలోని మహిళలు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలతో వంటకాలను తయారు చేయడం ఆదర్శవంతమన్నారు. ఇలాంటి ఆహార పదార్థాలను ప్రతి రోజు పట్టణ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అందించాలన్నారు. దీనిపై కమిషనర్‌ మాట్లాడుతూ మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుమతితో ఉచితంగా గదులు ఇస్తామని హామి ఇచ్చారు. బిపి, షుగర్‌ వ్యాదులతో బాధపడుతున్న వారికి నిత్యం రాగిసంగటి, రొట్టెలు అందిస్తే వారి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ విషయమై ఐకెపి మహిళలతో చర్చించి, తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్ అధికారి భారతి, జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, మాజీ కౌన్సిలర్‌ అమ్ము, వైఎస్సార్సీపి నాయకుడు మురుగప్పతో పాటు టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

హోమియో మందులు పంపిణీ….

పట్టణంలో మలేరియా, టైపాయిడ్‌ జ్వరాలు తీవ్రంకావడంతో ముందుజాగ్రత్తగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు డాక్టర్‌ సరళ, 1300 కుటుంబాలకు హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ మందులను ఐకెపి మహిళలు , వార్డు వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలన్నారు. డాక్టర్‌ శివ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మందులను మూడు రోజుల పాటు వేసుకోవాలని సూచించారు. దీని ద్వారా జ్వరాలను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చునని తెలిపారు.

వెహోక్కలు నాటారు…

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమిలో ఎస్‌వో లక్ష్మీతో కలసి మొక్కలు నాటారు. కమిషనర్‌ మాట్లాడుతూ పుంగనూరును హరిత పట్టణగా మార్చేందుకు అన్ని ఖాళీ స్థలాల్లోను మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.

చింతపండుకు జిఎస్టీ రద్దుపై వ్యాపారుల హర్షం

Tags: Nutrition is essential to stay healthy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *