Natyam ad

టీబీ పేషెంట్స్ కి పౌష్టికాహారం

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధానమంత్రి టీబీ యుక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో టీబీ పేషెంట్స్ కి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా టీబీ యూనిట్ పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లోని టీబీ వ్యాధిగ్రస్తులకు చదల్ల కు చెందిన NVR ట్రస్ట్ వ్యవస్థాపకులైన   యన్. వేణుగోపాల్ రెడ్డి  సుమారు 70 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి  మాట్లాడుతూ ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా డిస్టిక్ RBSK సమన్వయకర్త  సుదర్శన్  మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించిన వేణుగోపాల్ రెడ్డి మరియు వారి ట్రస్టు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ శ్రీవాణి , సల్మా బేగం , బాల సాయి రెడ్డి , సిద్ధార్థ రెడ్డి  మరియు ఎన్ వి ఆర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి ,నరేందర్ రెడ్డి నారాయణరెడ్డి ,జైపాల్ రెడ్డి, సందీప్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,చంద్రమోహన్ రెడ్డి, కిషోర్ రెడ్డి ,వెంకట్ రెడ్డి , మరియు PHC సూపర్‌వైజర్, ANMS, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Nutritional food for TB patients

Post Midle