పుంగనూరులో తల్లిబిడ్డల ఆరోగ్యం కోసమే పౌష్టికాహారం

పుంగనూరు ముచ్చట్లు:

తల్లిబిడ్డలు ఆరోగ్యంగా జీవించేందుకే నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు కౌన్సిలర్‌ నయీంతాజ్‌ అన్నారు. గురువారం నానబాలవీధి అంగన్‌వాడీ కేంద్రంలో ఆమె వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం క్రింద గర్భవతులకు పౌష్ఠిహాకారాన్ని పంపిణీ చేశారు. అలాగే కోనేటి పాళ్యెం అంగన్‌ వాడీ కేంద్రంలో కౌన్సిలర్లు పూలత్యాగరాజు, కొండవీటి గంగులమ్మ పోషకాహారాన్ని పంపిణీ చేశారు. కౌన్సిలర్‌ నయీంతాజ్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పీప్రైమరీస్కూల్‌గా మార్చడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడం, మెను ప్రకారం ఆహార పదార్థాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Nutritious food is for the health of mothers and babies in Punganur

Leave A Reply

Your email address will not be published.