Natyam ad

శ్రీ అభయాంజనేయ ఆలయ నిర్మాణానికి ఎన్.వి.ఆర్ ట్రస్ట్ విరాళం.

పుంగనూరు ముచ్చట్లు:

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి 8 లక్షల 50 వేలు విరాళం ప్రకటించిన ఎన్.వి.ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ఎన్ .వేణుగోపాల్ రెడ్డి.ప్రజలతో మమేకం కార్యక్రమంలో ఎన్.వి. ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ఎన్ .వేణుగోపాల్ రెడ్డి. పుంగనూరు నియోజకవర్గ ప్రజలతో మమేకం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎన్.ఎస్. పేటలో డా.ఎన్.వేణుగోపాల్ రెడ్డి ప్రతి గడప కు పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలతో మమేకం కార్యక్రమంలో భాగంగా మేము మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామాల్లో పర్యటించి మేము రాజకీయాల్లో రావాలన్న ప్రజల నిర్ణయాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నామని,గత నెల చదళ్ల శ్రీశ్రీశ్రీ సప్తమాతృక చౌడేశ్వరి దేవి దసరమహోత్సవాలు వైభవంగా నిర్వహించామని అనంతరం తిరిగి నేటి నుండి ప్రజలతో మమేకం కార్యక్రమం మొదలుపెట్టామన్నారు. పట్టణం లో ఎన్. ఎస్. పేట ప్రజలు మమ్ములను ఆహ్వానించారని అందులో భాగంగా నేడు పర్యటనలో రెండు మంచి కార్యక్రమాలు జరిగాయని మొదటిది ప్రజలను కలసి వారితో అధికార పార్టీలోకి రావాలా లేక ప్రతిపక్ష పార్టీలో చేరలా అన్న విషయంలో ప్రజలతో చర్చించమన్నారు.

 

 

 

Post Midle

మరొక మహోత్తర కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రజలు అత్యంత ప్రసిద్ధ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో మమ్మల్ని కలుపుకుని స్వామి వారి విగ్రహా ఏర్పాటుకు 8 లక్షల 50 వేలు విరాళం కోరగా మొదటి విడత రెండు లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని, అలాగే ఆలయ నిర్మాన పనులు మొదలైన అనంతరం పూర్తి ఆర్థిక సాయం విరాళం గా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఈ రోజు ఈ ఆలయ నిర్మాణంలో మమ్ములను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్.వి.ఆర్ ట్రస్ట్ అద్వర్యం లో ఎందరికో పలు రకాలుగా ఆర్థిక సాయం అందించామని అందులో కుళ,మతాల కు అతీతంగా మహమ్మదీయులకు మసీదు,దర్గా ల నిర్మాణానికి,హిందువుల పలు ఆలయాల నిర్మాణానికి, క్రిస్టియన్ ప్రార్థన మందిరాలు ఇలా ఎన్నో దేవాలయాల నిర్మాణాలకు ఆర్థిక విరాళాలు అందించడం జరిగినదన్నారు.ఈ రోజు ప్రజలకు మమేకం కార్యక్రమంలో ఇంత మంది ప్రజలు మమ్మల్ని అభిమానించి ఇక్కడకు ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్య క్రమంలో ఎన్. వి.ఆర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివ కుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నారాయణ రెడ్డి,వెంకట రెడ్డి, విరూపాక్ష ,జయపాల్ రెడ్డి,శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి,చంద్ర మోహన్ రెడ్డి,వెంకట రెడ్డి, కిషోర్ రెడ్డి,హరి నాయక్, బాలాజీ నాయక్,రేవంత్, నాయుడు, శీన,గంగా మరికొంత మంది ట్రస్ట్ సభ్యులు,ఎన్. ఎస్. పేట ప్రజలు పాల్గొన్నారు.

Tags: NVR Trust donation for the construction of Sri Abhayanjaneya Temple.

Post Midle