పుంగనూరు లో పలు వినాయక విగ్రహాల కోసం NVR ట్రస్ట్ చేయూత
పుంగనూరు ముచ్చట్లు:
NVR ట్రస్ట్ ఆధ్వర్యంలో డా యన్ వేణు గోపాల్ రెడ్డి పుంగనూరు పట్టణ , గ్రామీణ ప్రాంతాల యువతకు సుమారు 5 లక్షల రూపాయలు విగ్రహాల కోసం తమ వంతుగా చేయూత ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా పుంగనూరు నియోజక వర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు, మా NVR ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయకుని విగ్రహాల కోసం మా వంతుగా పలు చోట్ల యువతకు ఎంతో కొంత విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దైవ కార్యక్రమాలకు మా వంతు సాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేశారు.వినాయకుని కృప తో యావత్ ప్రజలు సుఖ శాంతులతో , ఆరోగ్యం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని ఆయన తెలియజేశారు .ఈ కార్యక్రమంలో NVR ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివ కుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నారాయణ రెడ్డి,జయపాల్ రెడ్డి,విరూపాక్ష, చిన్నా, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, వెంకట రెడ్డి, కిషోర్ రెడ్డి, ఆనంద రెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:NVR Trust for several Ganesha idols in Punganur
