Natyam ad

ఎన్.వి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం, చదళ్ల గ్రామ నివాసి ప్రముఖ యువ పారిశ్రామిక వేత్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి మరియు వారి మిత్ర బృందం తో కలిసి ఏర్పాటు చేసిన సేవ సంస్థ ఎన్.వి. ఆర్. ట్రస్ట్ తరపున వేణు గోపాల్ రెడ్డి  ఆదేశాల మేరకు స్థానిక MCV జూనియర్ కాలేజి లో 5 మంది పేద విద్యార్థులు ఫీజు చెలించక ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి వర్ష, రెడ్డి సౌమ్య, షాహిస్త అంజుం, జయ శ్రీ, నిహారిక వారి కాలేజ్ ఫీజు 40,000(నలభై వేలు) మొత్తం వారికి NVR ట్రస్ట్ సభ్యులు ద్వారా అందజేయడం జరిగింది. ఈ సంధర్భంగావేణు గోపాల్ రెడ్డి గారి కి విద్యార్థులు, వారి తల్లదండ్రులు మరియు కాలేజ్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో NVR ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, జయపాల్ రెడ్డి, నాగరాజ రెడ్డి, సురేష్ రెడ్డి, గంగాధర, ప్రతాప్, రెడ్డి శేఖర్, మనోహర్, సాయి నాథ్, శ్రీనివాసులు, మరియు మిత్రులు పాల్గొన్నారు.

Post Midle

Tags: NVR Various service programs under the auspices of the trust

Post Midle