Natyam ad

ఎన్.వి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం, చదళ్ల గ్రామానికి చెందిన   .ఎన్ వేణుగోపాల్ రెడ్డి  స్థాపించిన NVR ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో దూసుకెళ్తున్నాయి అనడంలో సందేహం లేదు, అనేక పురాతన ఆలయాలకు విరాళాలు ఇవ్వడమే కాకుండా చాలామంది నిరుపేద విద్యార్థులకు కూడా ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది .వాటిలో భాగంగానే, పుంగనూరు మండలం ఏతురు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయనిర్మాణం కొరకు 25 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మదనపల్లి మండలం, అంగళ్లు సమీపంలోని వినాయక చేనేత నగర్ లో వెలసిన మదరసా అభివృద్ధి కొరకు 25 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పుంగనూరు లోని N.S Peta లో కాపురముండు పుష్పమ్మ వారి కుమారుని ఆరోగ్యం కొరకు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో NVR ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నారాయణ రెడ్డి,జయపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, భాస్కర రెడ్డి, సందీప్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డి, వెంకట రెడ్డి,మరియు మిత్రులు పాల్గొన్నారు.

Post Midle

Tags:NVR Various service programs under the auspices of the trust

Post Midle