ఎన్.వి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం, చదళ్ల గ్రామ నివాసి ప్రముఖ యువ పారిశ్రామిక వేత్త ఎన్. వేణుగోపాల్ రెడ్డి మరియు వారి మిత్ర బృందం తో కలిసి ఏర్పాటు చేసిన సేవ సంస్థ ఎన్.వి. ఆర్. ట్రస్ట్ తరపున ఈ రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోమల మండలం ఇరికిపెంట క్రాస్ (గెంగిరెడ్డివారి పల్లి )లో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం నిర్మాణం కొరకు గ్రామ పెద్దలకు 30000(ముప్ఫై వేల రూపాయలు) విలువ చేసే కమ్మి అందజేయడం జరిగింది, అదేవిధంగా సదుం మండలం నడిగడ్డ గ్రామం లో నిర్మిస్తున్న రామాలయం మందిరం కొరకు తమ వంతుగా 20000(ఇరవై వేలు) ఇవ్వడం జరిగింది, అదేవిధంగా పులిచెర్ల మండలం జాండ్రపేట గ్రామములో నిర్మిస్తున్న శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయానికి తమ వంతుగా సుమారు 20000 వేలు అందజేయడం జరిగింది. ఎన్. వి. ఆర్. ట్రస్ట్ అధినేత ఎన్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కష్టంలో ఉన్న పేద ప్రజలకు ఎన్. వి. ఆర్. ట్రస్ట్ ద్వారా ఏదో ఒక విధంగా వారికి చేయూతనివ్వడం తన వంతు ధర్మం అని, తమ చుట్టూ ప్రక్కల గ్రామాల కే పరిమితం కాకున్న పుంగనూరు నియోజక వర్గంలో ని వేరే మండలాల వారికి కూడా సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలియజేశారు., ప్రజల ఆశీర్వాదాలతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతామని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్.వి. ఆర్. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రవి కుమార్, శంకర్ రెడ్డి, జయపాల రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మహేష్ రెడ్డి, సందీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వెంకట రెడ్డి, ఆనంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:NVR Various service programs under the auspices of the Trust

Leave A Reply

Your email address will not be published.