ఉద్యోగ. కార్మిక సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండివైఖరి విడనాడాలి  ఏఐటీయూసీ

నంద్యాల  ముచ్చట్లు:

సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండివైఖరి విడనాడాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె ప్రసాద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి  డి శ్రీనివాసులు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి  సుబ్బరాయుడు ఏఐటీయూసీ నాయకులు నాగేశ్వరయ్య నాగేంద్ర శివన్న అన్నారు.
అనంతరం సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ప్రజా . కార్మిక. కర్షక వ్యతిరేక విధానాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నది. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం వలన నిత్యావసర సరుకుల ధరల కు రెక్కలు రావడం జరిగిందన్నారు.
పేద మధ్య తరగతి ప్రజలు కార్మికులు పేరుగుతున్న ధరలను చూసి బెంబేలు ఎత్తుతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం . కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని కల్లా తల ఊపుతూ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఆ దాని. అంబానీ లకు సంపదను జమ కూర్చే దానిలో భాగంగా లాభాల బాటలో నడిచే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్పి కార్మికులను ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నదని అన్నారు. స్వాతంత్రం రాక మునుపు నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లు గా విభజించి కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసే ప్రయత్నం చేస్తున్నది అని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:ob. The stubbornness of the Central and State Governments on labor issues must be abandoned
AITUC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *