Natyam ad

పుంగనూరులో పంటల ఈక్రాప్‌పై 31లోపు అభ్యంతరాలు తెలపాలి – ఏడి శివకుమార్‌

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు పండించిన పంటల ఈక్రాప్‌ నమోదు కార్యక్రమంపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈనెల 31 లోపు తెలపాలని ఏడి శివకుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఖరీఫ్‌ పంటలు నమోదు చేశామన్నారు. పుంగనూరులో12,583 ఎకరాలలో 6,689 మంది రైతులు, చౌడేపల్లెలో10,152 ఎకరాలలో4,366 మంది రైతులు , సోమలలో 11,323 ఎకరాలలో 4,615 మంది రైతులు, పెద్దపంజాణి 13008 ఎకరాలలో 5,870 మంది రైతులు , గంగవరంలో 12,838 ఎకరాలలో 6,106 మంది రైతుల పంటలను నమోదు చేశామన్నారు. 59,904 ఎకరాలలో 27,646 మంది రైతులు లభ్ధిపొందనున్నారని తెలిపారు. వీటి జాబితాను విడుదల చేశామని , దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 31 లోపు తెలపాలన్నారు. ఈ క్రాప్‌ జాబితాలను ఆయా సచివాలయల పరిధిలో ప్రదర్శించామన్నారు. అలాగే సామాజిక తనిఖీ రైతు భరోసా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యంతరాలను పరిశీలించి, నవంబర్‌ 2లోపు తహశీల్ధార్‌ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిపై రైతులు అవగాహన చేసుకోవాలని కోరారు.

 

Post Midle

Tags: Objections should be raised before 31st on crop e-crop in Punganur – AD Sivakumar

Post Midle