అంగన్వాడి కేంద్రంలో ఎంపిడివో పరిశీలన

ఏలూరు ముచ్చట్లు

ఏలూరుజిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామంలో పెదవేగి ఎం పి డి ఓ జి.రాజ్ మనోజ్ శుక్రవారం స్థానిక ఎలిమెంటరీ పాఠశాల.అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు సులభతరంగా అందిస్తున్న విద్యా బోధన తీరు ను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం ద్వారా అందిస్తున్న  అమ్మ ఒడి పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్న మౌలిక వసతులు.త్రాగునీరు.టాయిలెట్స్.ప్రాథమిక విద్య స్థాయినుండే ప్రభుత్వం విద్యార్థులకు తప్పనిసరిగా   నెల నెలా  వైద్య సిబ్బందితో అందించా బోయే వైద్యసేవలు పై ఎం పి డి ఓ ఉపాధ్యాయులకు వివరించారు.గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలలో.విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో క్వాలిటీ విద్యనందించి రాష్ట్ర స్థాయిలో  ప్రభుత్వ పాఠశాలలకు క్వాలిటీ విద్యనందించి ఉత్తమ పాఠశాలలుగా గుర్తింపు తీసుకురావాలని కోరారు.అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో కూడా బాలలకు పౌష్టిక ఆహారం తో పాటు ఆట పాటల ద్వారా విద్యనందించాలన్నారు.అంగన్వాడీ చిన్నారులకు పప్పు ధాన్యాలతో ఆకు కూరలతో కూడిన పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలని .పిల్లలకు డి పి టి మీజాల్స్.బూస్టర్ వంటి తీకాలను అందించి అంగన్వాడీల ద్వారా సమాజానికి ఆరోగ్య వంతులైన విద్యార్థులను అందించి అంగన్వాడీల ద్వారానే మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమని చాటి చెప్పేలా అంగన్వాడీ వర్కర్ లు సేవాలందించాలని చెప్పారు.అనంతరం గ్రామం లో జగనన్న లే ఔట్  పరిశీలించి గృహ నిర్మాణాలు ప్రగతిని పరిశీలించారు.

Tags:Observation of MPDO at Anganwadi Centre

Leave A Reply

Your email address will not be published.