Natyam ad

శిఖరేశ్వరాలయ పరిశీలన

శ్రీశైలం ముచ్చట్లు:

 

శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా శిఖరేశ్వర ఆలయములో పలు చర్యలు చేపవలసినదిగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు  ఇంజనీరింగ్, ఉద్యానవన, ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి ఆయన శిఖరేశ్వర అక్కడి పుష్కరిణి, సాక్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారి నుంచి శిఖరేశ్వరం వరకు గల సి.సి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటవలసినదిగా ఉద్యానవన అధికారిని ఆదేశించారు. సుందరీకరణ పనులలో భాగంగా శిఖరేశ్వర ఆలయ పరిసరాలలో అనువైనచోట్ల పచ్చికబయలు ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే శిఖరేశ్వర ఆలయ ప్రాంగణం చుట్టూ ( మూడువైపులా ఉద్యానవనాలను పెంచెందుకు వెంటనే తగు ప్రణాళికలు రూపొందించవలసినదిగా ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.ఈ ఉద్యానవనములో నందివర్ధనం, గరుడవర్ధనం, కనకాంబరం, దేవగన్నేరు, మందారం, గులాబి మొదలైన పూలమొక్కలు నాటాలన్నారు. ఈ ఉద్యానవనం ద్వారా వచ్చే పూలను స్వామివార్ల నిత్య కైంకర్యాలకు వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఆలయ పరిసరాలలో బిల్వం, కదంబం, ఉసిరి మొదలైన దేవతా వృక్షాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

 

 

తరువాత శిఖరేశ్వర ఆలయ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలకు అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. శిఖరేశ్వర ఆలయ మెట్ల మార్గంలోని మెట్లకు అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. అదేవిధంగా శిఖరేశ్వర ఆలయం వద్ద గది కటంజనాలు మొదలైనవాటికి వెంటనే పెయింటింగ్ పనులు చేయాలని ఆదేశించారు. ఆలయములో ఎలక్ట్రికల్ వైరీంగ్ కూడా వెంటనే తగు మరమ్మతులు చేయాలని సూచించారు.తరువాత ఆయన శిఖరేశ్వర ఆలయ పుష్కరిణి పరిశీలించారు. పుష్కరిణీలో పూడిక తీస్తూ ఎప్పటికప్పుడు పుష్కరిణి పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఆలయప్రాంగణం, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేందుకుగాను ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగిస్తుండాలన్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులందరితోనూ మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు కె.రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సివిల్ విభాగపు సహాయ ఇంజనీర్ సీతారమేష్, ఎలక్ట్రికల్ విభాగపు సహాయ ఇంజనీరు వెంకటేశ్వరరావు, నీటిసరఫరా విభాగపు సహాయ ఇంజనీర్ రాజేశ్వరరావు, ఉద్యానవన అధికారి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Observation of Shikreshwara Temple

Post Midle

Leave A Reply

Your email address will not be published.