Natyam ad

పుంగనూరు ప్రభుత్వాసుపత్రి అప్‌గ్రేడ్‌పై పరిశీలన

పుంగనూరు ముచ్చట్లు:

స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిగా మార్పు చేసేందుకు ఆసుపత్రిని డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బిసికె. నాయక్‌ మంగళవారం రాత్రి సందర్శించారు. ఆసుపత్రి అభివృద్ది కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌ , మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పైరోజ్‌బేగంతో కలసి ఆసుపత్రిని పరిశీలించి అప్‌గ్రేడ్‌ చేసేందుకు నివేదికలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. కాగా 50 పడకల ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వాపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేసి, అన్ని రకాల జబ్బులకు వైద్యులను నియమించేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకున్నారని డాక్టర్‌ శరణ్‌ తెలిపారు. త్వరలోనే ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Post Midle

Tags: Observation on Upgradation of Punganur Government Hospital

Post Midle

Leave A Reply

Your email address will not be published.