ఎన్నికల విధులకు ఆటంకం..
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అధికారులు…
మేడ్చల్ ముచ్చట్లు:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వేణుగోపాల స్వామి గుడివద్ద జరిగిన కాంగ్రెస్ సభ రసాభాసగా మారింది. ఎలక్షన్ కమీషన్ సర్వైలైన్ వీడియో టీం కాంగ్రెస్ సభ ఎక్స్పండెచర్ ను కవర్ చేస్తున్న సమయంలో ఈసి వీడీయో గ్రాపర్ లపై దాడికి దిగారు కాంగ్రెస్ నాయకులు. వీడియో కెమెరాతో పాటు చీఫ్ లు, మొబైల్స్ ఫోన్ లు లాక్కోని దౌర్జన్యానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలపై జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేశారు. ఈసి సర్వైలైన్ టీం హెడ్ రమేష్, నాగరాజ్. ఈసీ టీం ఇచ్చిన పిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై ఐపిసీ 384,334,188 సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసి ఈసీ సర్వైలైన్ కెమెరాతో పాటు చిప్ లను తిరిగిచ్చినట్టు మీడియాకు తెలిపారు జీడిమెట్ల సిఐ పవన్ కుమార్.

Tags: Obstruction of election duties..
